తాజాగా అమరావతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించేందుకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి పర్యటన చేయడం మొదలు పెట్టారు. దీంతో రైతులు చంద్రబాబు నాయుడు పర్యటనను నిరసిస్తూ రెండు వర్గాలుగా విడి పోవడం జరిగింది. కొంత మందికి ఆయనకు అనుకూలంగా మరికొంత మంది ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
వెంకటాయిపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తలు చెప్పులు, కర్రలు విసరడం మొదలు పెట్టారు. దీంతో వైసీపీ కార్యకర్తల పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగడంతో ఇరు వర్గాలు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన టెన్షన్ టెన్షన్ గా మారింది.
అమరావతిలో కూల్చివేసిన ప్రజావేదికను చంద్రబాబు పరిశీలించడం జరిగింది. ఉద్దండరాయపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించుకోవడం జరిగింది. గృహ సముదాయాల నిర్మాణాలను కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు.

మరో వైపు దళితుల భూముల విషయంలో మోసం చేసారని..గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. చంద్రబాబు వ్యతిరేక వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దళిత రైతులకు క్షమాపణ చెప్పకుండా ముందుకు వెళ్లనీయమంటూ అడ్డుకొనేందుకు దూసుకు రావడం జరిగింది.
ఇప్పటికే టీడీపీ వర్సెస్ వైసీపీ చంద్రబాబు పర్యటన పైన మంత్రులు బొత్సా వంటి వారు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రాజకీయంగా దీని పైన టీడీపీ సైతం తిప్పి కొట్టడం జరిగింది. ఇక, చంద్రబాబు తన హాయంలో జరిగిన రాజధాని పనుల గురించి వివరించటానికి జాతీయ మీడియాను తన పర్యటనలో బాబు వెంట తీసుకొని కూడా వెళ్లడం జరిగింది. తాజాగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులతో ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది అంటే నమ్మండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి